ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆరుగురు ఏకగ్రీవం
Mar 3 2017 10:26 PM | Updated on May 25 2018 7:10 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో మంతెన సత్యనారాయణ, అంగర రామ్మోహన్, తూర్పుగోదావరి జిల్లాలో చిక్కాల రామచంద్రరావు, అనంతపురం జిల్లాలో దీపక్‌రెడ్డి, చిత్తూరు జిల్లాలో దొరబాబు, శ్రీకాకుళం జిల్లా శత్రుచర్ల విజయరామరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులు ఈరోజు నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. మరోవైపు నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది.
Advertisement
Advertisement