విజయనగరంలో సిరిమాను ఉత్సవం కన్నుల పండువగా జరుగుతోంది.
విజయనగరం: విజయనగరంలో సిరిమాను ఉత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. పైడితల్లి ఆలయం నుంచి ప్రారంభమైన ఉత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 3 లక్షల మంది భక్తులు హాజరయ్యారు.
ఆలయ ధర్మకర్త, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులతో కలసి కోట బురుజుపై నుంచి ఉత్సవాలను తిలకించారు. పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా ఉత్సవాల్లో పాల్గొన్నారు.