మతిస్థిమితం కోల్పోయిన సింగరేణి మాజీ కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని కోటబోగుడవాడలో జరిగింది.
సింగరేణి మాజీ కార్మికుడి ఆత్మహత్య
Sep 17 2013 12:32 AM | Updated on Nov 6 2018 7:53 PM
	 చెన్నూర్, న్యూస్‌లైన్ :మతిస్థిమితం కోల్పోయిన సింగరేణి మాజీ కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని కోటబోగుడవాడలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బొగె మల్లేశ్(55) 13 ఏళ్ల క్రితం సింగరేణి ఉద్యోగం వదిలేశాడు. అనంతరం తాగుడుకు బానిసయ్యాడు. కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం కోల్పోయూడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లాడు. స్థానిక పెద్ద చెరువు కట్టపై ఉన్న చెట్టుకు ఇనుప వైరుతో ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మల్లేశ్‌కు భార్య స్వరూప, కుమారులు అశోక్, అనిల్, జయకుమార్ ఉన్నారు. వీరి రోదన స్థానికులను కదిలించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింగారెడ్డి తెలిపారు.
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
