ఓ గిరిజన యువతిపై ఎస్ ఐ దాడి చేసిన ఘనట మంగళవారం కర్నూలు జిల్లా చాగలమర్రిలో జరిగింది.
- తల్లి ఆత్మహత్యాయత్నం
చాగలమర్రి (కర్నూల్)
ఓ గిరిజన యువతిపై ఎస్ ఐ దాడి చేసిన ఘనట మంగళవారం కర్నూలు జిల్లా చాగలమర్రిలో జరిగింది. కూతురుపై పోలీసు దాడి చేయడంతో మనస్తాపం చెందిన యువతి తల్లి ఆత్మహత్యా యత్నం చేసింది. ఘనట వివరాల్లోకి వెళితే.. చాగలమర్రికి చెందిన గిరిజన మహిళ చిన్నలక్ష్మీబాయి భర్తకు, మరో వ్యక్తికి మధ్య గొడవ జరిగింది. ఘర్షణ కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ కేసులో లక్ష్మీబాయ్ భర్తపై పోలీసులు చితకబాదారు. తన భర్తను ఎందుకు కొడుతున్నారంటూ నిలదీసిన చిన్న లక్ష్మీబాయిని కూడా పోలీసులు లాఠీతో కొట్టారు.
ఈ సంఘటనతో అందరి ముందు తన కూతున్ని పోలీసులు కొట్టారని మనస్థాపంతో చెందిన తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను చావల మర్రిలోని కేరళ ఆసుపత్రిలో ప్రదమ చికిత్స చేసి కడప జిల్లా పొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషయంగా ఉంది. పోలీస్‌స్టేషన్‌లో మహిళపై పోలీసులు ప్రతాపం చూపడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన మహిళపై దాడి చేసిన ఎస్‌ఐని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.