breaking news
Laxmibai
-
గిరిజన మహిళపై ఎస్ఐ దాడి
- తల్లి ఆత్మహత్యాయత్నం చాగలమర్రి (కర్నూల్) ఓ గిరిజన యువతిపై ఎస్ ఐ దాడి చేసిన ఘనట మంగళవారం కర్నూలు జిల్లా చాగలమర్రిలో జరిగింది. కూతురుపై పోలీసు దాడి చేయడంతో మనస్తాపం చెందిన యువతి తల్లి ఆత్మహత్యా యత్నం చేసింది. ఘనట వివరాల్లోకి వెళితే.. చాగలమర్రికి చెందిన గిరిజన మహిళ చిన్నలక్ష్మీబాయి భర్తకు, మరో వ్యక్తికి మధ్య గొడవ జరిగింది. ఘర్షణ కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ కేసులో లక్ష్మీబాయ్ భర్తపై పోలీసులు చితకబాదారు. తన భర్తను ఎందుకు కొడుతున్నారంటూ నిలదీసిన చిన్న లక్ష్మీబాయిని కూడా పోలీసులు లాఠీతో కొట్టారు. ఈ సంఘటనతో అందరి ముందు తన కూతున్ని పోలీసులు కొట్టారని మనస్థాపంతో చెందిన తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను చావల మర్రిలోని కేరళ ఆసుపత్రిలో ప్రదమ చికిత్స చేసి కడప జిల్లా పొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషయంగా ఉంది. పోలీస్‌స్టేషన్‌లో మహిళపై పోలీసులు ప్రతాపం చూపడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన మహిళపై దాడి చేసిన ఎస్ఐని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. -
కేటరింగ్ బాయ్ TO సీబీఐ ఎస్సై వరకు..
నార్నూర్ : ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామానికి చెం దిన చాటే విఠల్, లక్ష్మీబాయి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరు ఆరేళ్ల క్రితం నార్నూర్ మండల కేంద్రానికి వలస వచ్చారు. వీరికి ముగ్గురు కుమారులు, కూతు రు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు సంతోష్, రెండో కుమారుడు కృష్ణ. సంతోష్ వ్యాపారం నిర్వహిస్తూ కు టుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక కృష్ణకు చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో ఇష్టం. తమ్ముడి ఆసక్తిని గమనించిన సంతోష్ పట్టుదలతో చదివించి, ఎల్లవేళలా ప్రోత్సహిం చాడు. కృష్ణ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ముత్నూర్ ప్రభుత్వ పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు ఇంద్రవెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. పదో తరగతిలో 518 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. నిర్మల్ ఎన్బీఆర్ జూని యర్ కళాశాలలో ఇంటర్ చదివి 948 మార్కులు సాధిం చి కళాశాల టాపర్‌గా నిలిచాడు. అతడి ప్రతిభను గుర్తిం చిన హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలల యాజమాన్యం ఒక సంవత్సరం ఉచితంగా ఎంసెట్‌లో కోచింగ్ ఇచ్చింది. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకుతో హైదరాబాద్‌లోని సీవీఆర్ కళాశాలలో ఇంజినీరింగ్‌లో చేరాడు. చదువు.. పని.. ఇంజినీరింగ్ చదువుతూనే సొంత ఖర్చుల నిమిత్తం కేటరింగ్ పనికి వెళ్లేవాడు. పగలు కళాశాలకెళ్లి.. రాత్రి కేటరింగ్ బాయ్‌గా పనిచేసేవాడు. కేటరింగ్ ద్వారా రోజు రూ.150 సంపాదించేవాడు. ఆ డబ్బుతో చదువు, సాధారణ ఖర్చులకు ఇబ్బంది ఉండేదికాదు. ఇలా.. చదివి బీటెక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. తార్నాకలోని వంజారి సంఘం హాస్టల్లో ఉంటూ సినీ హీరో శ్రీకాంత్ కుమారులకు హోం ట్యూషన్ చెబుతూ ఏడాదిపాటు పోటీ పరీక్షలకు సొంతంగా ప్రిపేర్ అయ్యాడు. 2012లో ఎస్ఎస్సీ(స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) డిగ్రీ అర్హతతో ప్రకటన వెలువడడంతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రిపేర్ అయ్యాడు. దేశవ్యాప్తంగా మొదటి దశకు పది లక్షల మంది హాజరవగా రెండో దశకు 1.12 లక్షల మంది అర్హత సాధించారు. ఆ తర్వాత ఇంటర్వ్యూకు ఐదు వేల మంది ఎంపికయ్యారు. తెలుగు మీడియం అయినప్పటికీ కృష్ణ ఇంగ్లిష్‌లో జరిగిన ఇంటర్వ్యూలో సునాయాసంగా విజయం సాధించాడు. దేశవ్యాప్తంగా 34 మంది సీబీఐ ఎస్సైగా ఎంపికైతే వారిలో తెలంగాణ రాష్ట్రం నుంచి కృష్ణ ఒక్కడే కావడం అతడి అసాధారణ ప్రతిభకు నిదర్శనం. అంతేకాదు ఎస్బీఐ, ఎస్బీడబ్ల్యూ, ఆంధ్రాబ్యాంక్, ఆర్ఆర్బీ, ఎఫ్‌సీఐ తదితర ఉద్యోగాలను ఒకే ప్రయత్నంలో సాధించాడు. గాజియాబాద్ (యూపీ)లోని సీబీఐ అకాడమీలో 8 నెలల శిక్షణ పూర్తి చేశాడు. సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా ద్వారా బంగారు పతకం అందుకున్నాడు. ప్రస్తుతం సీబీఐ ముంబయి బ్రాంచిలో అవినీతి నిరోధక విభాగంలో సీబీఐ ఎస్సైగా పనిచేస్తున్నాడు.