షార్ట్ సర్క్యూట్‌తో స్వీట్ హౌస్ దగ్ధం | Short circuit Sweet House | Sakshi
Sakshi News home page

షార్ట్ సర్క్యూట్‌తో స్వీట్ హౌస్ దగ్ధం

Sep 30 2013 3:44 AM | Updated on Mar 28 2018 10:56 AM

మండల కేంద్రంలోని ఓ స్వీట్ హౌస్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో రూ. 3 లక్షల విలువైన ఆస్తినష్టం జరిగింది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది.

ధారూరు, న్యూస్‌లైన్: మండల కేంద్రంలోని ఓ స్వీట్ హౌస్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో రూ. 3 లక్షల విలువైన ఆస్తినష్టం జరిగింది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం జలూర్‌గిట్కా ప్రాంతానికి చెందిన సూరజ్‌కుమార్ ధారూరులోని బస్టాండ్ సమీపంలో ఐదేళ్లుగా స్వీట్ హౌస్ నడుపుతున్నాడు. శనివారం రాత్రి 10 గంటలకు అతడు వ్యాపారం ముగించుకొని దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు. అర ్ధరాత్రి దాటిన తర్వాత స్వీట్ హౌస్‌లో నుంచి దట్టమైన మంటలు, పొగలు వచ్చి పక్కనే ఉన్న భవన యజ మాని ప్రభు ఇంట్లోకి కూడా వ్యాపించాయి.
 
 దీంతో భయపడిన కుటుంబీకులు బయటకు పరుగులు తీశారు. వెంటనే స్థానికులను నిద్రలేపి మంటలు ఆర్పే యత్నం చేశారు. ఫైరింజన్ వచ్చేసరికి స్వీట్‌హౌస్‌లోని దాదాపు రూ. 3 లక్షలు విలువ చేసే రెండు ఫ్రిజ్‌లు, కూల్‌డ్రింక్స్, స్వీట్లు ఇతర సామగ్రి కాలిపోయాయి. దుకాణంలో ఓ సిలిండర్ ఖాళీగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ2 మోయినొద్దీన్, వీఆర్‌ఓ రాంచందర్‌రావులు పరి శీలించి  పంచనామా నిర్వహించారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందని బాధితుడు సూరజ్‌కుమార్ తెలిపాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement