breaking news
Sweet House
-
వలస కుటుంబాన్ని వెంటాడుతున్న మృత్యువు
సాక్షి, అర్వపల్లి (నల్లగొండ): పొట్టకూటి కోసం రాజస్థాన్ నుంచి ఇక్కడకు వచ్చి జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతోంది. ఒకే ఏడాది ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జోద్పూర్ ప్రాంతానికి చెందిన దేవాసి కైలాస్ అలియాస్ సురేశ్, దేవాసి చెన్నారాం అలియాస్ రమేశ్ సోదరులు. వీరు చిన్న వయసులోనే బతుకు దెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చి అర్వపల్లి మెయిన్‌రోడ్డులో రాజస్థాన్ టీస్టాల్, స్వీట్‌హౌస్ నడుపుతున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి 29న సురేశ్ బైక్‌పై నల్లగొండ జిల్లా శాలిగౌరారంనకు తన బంధువుల వద్దకు వెళ్లి టీపొడి తీసుకొని వస్తూ జాజిరెడ్డిగూడెం–మాదారం మధ్య హైవేపై రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికుల వద్ద రూ.1.20 లక్షలు చందాలు సేకరించి అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసి వచ్చారు. ఆ తర్వాత సురేశ్ సోదరుడు రమేశ్ టీస్టాల్‌ను నడిపిస్తున్నాడు. వీరిద్దరు సోదరులు కూడా సేవాతత్పరులు కావడంతో స్థానికులు వారిని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. అయితే లాక్డౌన్, ఇతర సమయాల్లో ఇద్దరు సోదరులు ఎందరో పేదలకు తమ వంతు సాయమందించారు. రాజస్థాన్‌లో మరో సోదరుడు.. కాగా, రమేశ్ 15 రోజుల క్రితం తల్లిదండ్రులను చూసేందుకు రాజస్థాన్‌లోని స్వగ్రామానికి వెళ్లాడు. అయితే పోయేటప్పుడు పెద్ద సోదరుడు మోహన్‌ను రాజస్థాన్ నుంచి ఇక్కడికి పిలిపించి టీస్టాల్ నడిపించమని చెప్పి వెళ్లాడు. అయితే ఆదివారం రాత్రి వారి స్వరాష్ట్రం రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో విషయం తెలిసి స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఏడాది తిరక్కముందే ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. కాగా వీరిద్దరి ఆధార్‌కార్డులు, రేషన్ కార్డులు ఇక్కడే తీసుకున్నారు. చదవండి: రైల్వే కోచ్ రెస్టారెంట్ సూపర్ సక్సెస్ -
కీసరలో అగ్నిప్రమాదం, ఒకరు సజీవ దహనం
జిల్లాలోని కీసరలో ఓ స్వీట్‌హౌస్‌లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ఒకరు సజీవ దహనమైయ్యారు. బాలాజీ స్వీట్‌హౌస్‌లో అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది. -
షార్ట్ సర్క్యూట్‌తో స్వీట్ హౌస్ దగ్ధం
ధారూరు, న్యూస్‌లైన్: మండల కేంద్రంలోని ఓ స్వీట్ హౌస్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో రూ. 3 లక్షల విలువైన ఆస్తినష్టం జరిగింది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం జలూర్గిట్కా ప్రాంతానికి చెందిన సూరజ్‌కుమార్ ధారూరులోని బస్టాండ్ సమీపంలో ఐదేళ్లుగా స్వీట్ హౌస్ నడుపుతున్నాడు. శనివారం రాత్రి 10 గంటలకు అతడు వ్యాపారం ముగించుకొని దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు. అర ్ధరాత్రి దాటిన తర్వాత స్వీట్ హౌస్‌లో నుంచి దట్టమైన మంటలు, పొగలు వచ్చి పక్కనే ఉన్న భవన యజ మాని ప్రభు ఇంట్లోకి కూడా వ్యాపించాయి. దీంతో భయపడిన కుటుంబీకులు బయటకు పరుగులు తీశారు. వెంటనే స్థానికులను నిద్రలేపి మంటలు ఆర్పే యత్నం చేశారు. ఫైరింజన్ వచ్చేసరికి స్వీట్హౌస్లోని దాదాపు రూ. 3 లక్షలు విలువ చేసే రెండు ఫ్రిజ్‌లు, కూల్‌డ్రింక్స్, స్వీట్లు ఇతర సామగ్రి కాలిపోయాయి. దుకాణంలో ఓ సిలిండర్ ఖాళీగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ2 మోయినొద్దీన్, వీఆర్ఓ రాంచందర్‌రావులు పరి శీలించి పంచనామా నిర్వహించారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందని బాధితుడు సూరజ్‌కుమార్ తెలిపాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.