నర్సుపై డాక్టర్ లైంగిక వేధింపులు | sexual harassment on Nurse | Sakshi
Sakshi News home page

నర్సుపై డాక్టర్ లైంగిక వేధింపులు

Aug 1 2015 6:48 PM | Updated on Aug 20 2018 4:27 PM

ఏఎన్‌ఎంపై లైంగిక వేధింపుల కేసులో ఓ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కలువాయి (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు) : ఏఎన్‌ఎంపై లైంగిక వేధింపుల కేసులో ఓ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయిలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కుల్లూరు పీహెచ్‌సీలో ఓబుల్‌రాజ్ అనే వైద్యుడు పనిచేస్తున్నారు.

కాగా ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆస్పత్రిలో పనిచేసే ఓ నర్సు శనివారం నెల్లూరులోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన డీఎస్పీ శ్రీనివాసాచారి వెంటనే గ్రామానికి చేరుకుని, ఆస్పత్రి  సిబ్బందిని విచారించారు. అనంతరం సదరు వైద్యుడు నిర్వహిస్తున్న క్లినిక్‌కు వెళ్లి డాక్టర్ ఓబుల్‌రాజ్‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement