విషవాయువులు పీల్చి ఏడుగురు కూలీలకు అస్వస్థత | seven hospitalised in gajuwaka | Sakshi
Sakshi News home page

విషవాయువులు పీల్చి ఏడుగురు కూలీలకు అస్వస్థత

Jul 8 2015 7:26 PM | Updated on Sep 3 2017 5:08 AM

విషవాయువు పీల్చి ఏడుగురు కూలీలు అస్వస్థతకు గురయ్యారు.

గాజువాక (విశాఖపట్టణం): విషవాయువు పీల్చి ఏడుగురు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన విశాఖపట్టణం జిల్లా గాజువాక సమీపంలోని రాంనగర్‌లోని కెమికల్ గోడౌన్‌లో బుధవారం జరిగింది. వివరాలు.. రసాయనిక పదార్థాల బస్తాలు దించుతుండగా గోడౌన్‌లో చేరవేస్తుండగా విషవాయువు పీల్చడంతో వారు సొమ్మసిల్లి పడిపోయారు. ఫ్యాక్టరీ యజమానులు వెంటనే వారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement