శ్రీకాకుళం పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీస్‌లో సర్వీస్ రిజిస్టర్లు మాయమయ్యాయి.
శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీస్‌లో సర్వీస్ రిజిస్టర్లు మాయమయ్యాయి. ఈ సంఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో సర్వీస్ రిజిస్టర్లు కనిపించకపోవడంతో ఉద్యోగులు ఎమ్మార్వోను నిలదీశారు. దీంతో ఎమ్మార్వో తాను కొత్తగా వచ్చానని, విషయం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుంటానని సమాధానమిచ్చారు.
కాగా, ఎమ్మార్వో కార్యాలయంలో ఉన్న ఉద్యోగులను ఈ విషయంపై ఆరా తీయగా.. వారు కలెక్టరు కార్యాలయంలో ఏవోకి సమర్పించామని చెప్పారు. అయితే, ఏవో మాత్రం రిజిస్టర్లు నాకు ఇస్తే, ఎకనాలెడ్జిమెంట్ చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఆర్ లు మాయంపై విచారణ జరపాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు