
మంత్రి రఘువీర నివాసాన్ని ముట్టడించిన సమైక్యవాదులు
రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డికి సమైక్య సెగ తగిలింది. కళ్యాణదుర్గంలోని మంత్రి రఘువీరారెడ్డి నివాసాన్ని సమైక్యవాదులు ఆదివారం ముట్టడించారు.
రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డికి సమైక్య సెగ తగిలింది. కళ్యాణదుర్గంలోని మంత్రి రఘువీరారెడ్డి నివాసాన్ని సమైక్యవాదులు ఆదివారం ముట్టడించారు. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని సమైక్యవాదులు రఘువీరారెడ్డిని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో మంత్రి రఘువీరా ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో వెంటనే పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొన్నాలని వారు డిమాండ్ చేశారు. రఘువీరా ఇంటిని సమైక్యవాదులు ముట్టడించడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సమైక్యవాదులను కట్టడి చేసేందుకు యత్నిస్తున్నారు.