విభజన ముసాయిదా బిల్లు ప్రతులను భోగిమంటల్లో వేయడాన్ని నిరసిస్తూ సోమవారం బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా వద్ద తెలంగాణ కుల సంఘాల ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీవో, సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు.
బెల్లంపల్లిరూరల్, న్యూస్‌లైన్: విభజన ముసాయిదా బిల్లు ప్రతులను భోగిమంటల్లో వేయడాన్ని నిరసిస్తూ సోమవారం బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా వద్ద తెలంగాణ కుల సంఘాల ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీవో, సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ బిల్లు ప్రతులను దహనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రపతిని అవమానించడమేనని అన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలను సీమాంధ్రులు మానుకుని ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు సహకరించాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ జిల్లాల్లో నివసిస్తున్న సీమాంధ్రులను తెలంగాణ పొలిమేర వరకు తరిమికొడతామని హెచ్చరించారు. అంతకుముందు పాతబస్టాండ్ నుంచి కాంటా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కీర్తి నరసింగరావు, కొండబత్తిని రాంమోహన్, పోతరాజు నారాయణ, చంద్రశేఖర్, శ్రీనివాస్, మల్లేశ్, రాజన్న పాల్గొన్నారు.
అశోక్‌బాబు దిష్టిబొమ్మ ద హనం
ఏదులాపురం : తెలంగాణ బిల్లు ప్రతుల దహనాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకులు సోమవారం జేఏసీ దీక్ష శిబిరం ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా నాయకుడు జంగిలి ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లు ప్రతులు చించివేయడం రాజ్యాంగ విరుద్ధమని, అశోక్‌బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర అవకాశవాదులు ఎన్నికుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని అన్నారు. అశోక్‌బాబు ఉద్యోగిగా వ్యవహరించాలని కానీ ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకులు బండారి సతీశ్, గోలి శంకర్, ఎర్రం నర్సింగ్‌రావు, శ్రీపతి శ్రీనివాస్, తిరుపతి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బాల శంకర్‌కృష్ణ పాల్గొన్నారు.