రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. వంద రోజుల నుంచి ప్రజలు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. వంద రోజుల నుంచి ప్రజలు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగించాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ తీర్మానం చేసింది. ఈ నెల 23 వరకు విధుల్ని బహిష్కరించాలని ఆందోళన చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రాన్ని సమైక్యం ఉంచాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహదారులను దిగ్భంధించిన సంగతి తెలిసిందే. సీమాంధ్రలో ఇటీవల సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు.