కేవలం రాజ్యసభ సీటు కోసమే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అశోక్ బాబు తాకట్టు పెట్టారని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఉపాధ్యక్షుడు కారెం శివాజీ మండిపడ్డారు.
హైదరాబాద్ : కేవలం రాజ్యసభ సీటు కోసమే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అశోక్ బాబు తాకట్టు పెట్టారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ మండిపడ్డారు. జనవరి 3వ తేదీలోపు ప్రజా సంఘాలు, కుల సంఘాలతో సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
మరోవైపు ఏపీ ఎన్జీవో నేతలు....అశోక్ బాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అశోక్ బాబు సమైక్య ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారని బషీర్, సత్యనారాయణ, శ్రీనివాస్ మండిపడ్డారు. విభజనకు పూనుకున్న పార్టీలతో అఖిలపక్షం నిర్వహించి....సమైక్యవాణిని వినిపించేవారిని పక్కన పెట్టారని వారు అన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తాం, దిగ్విజయ్ని అడ్డుకుంటామని అశోక్ బాబు చెప్పిన మాటలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు. అశోక్ బాబు అసమర్థతను అన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. 66 రోజుల సమ్మె కాలాన్ని క్యాజువల్ లీవ్గా పరిగణించాలని కోరారు.