టీ.ఉద్యోగులను సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చగొడుతున్నారు | seemandhra employees provoking us :secretariat T.employees chief Narendra rao | Sakshi
Sakshi News home page

టీ.ఉద్యోగులను సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చగొడుతున్నారు

Aug 14 2013 11:55 AM | Updated on Aug 20 2018 8:20 PM

తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టేలా సీమాంధ్ర ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని సచివాలయం తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్రావు ఆరోపించారు.

తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టేలా సీమాంధ్ర ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని సచివాలయం తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్రావు ఆరోపించారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన నిరసన వెంటనే విరమించుకోవాలిని ఆయన డిమాండ్ చేశారు.

 

మా సంయమనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని ఆయన సీమాంధ్ర ఉద్యోగులకు సూచించారు. సీమాంధ్రుల ఉద్యమాన్ని ఈ ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తుందన్నారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు నిరసనలు ఆపకుంటే ఈ నెల 17న తమ కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుందని నరేందర్రావు స్ఫష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement