సమైక్య రాష్ట్రం కోసం ఈ నెల 23,24 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడతామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు మురళీ కృష్ణ చెప్పారు.
గుంటూరు: సమైక్య రాష్ట్రం కోసం ఈ నెల 23,24 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడతామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు మురళీ కృష్ణ చెప్పారు. 300 మంది సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ దీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగం తగ్గిందని చెప్పారు. విభజన వల్ల దేశం వినాశనం అవుతుందన్న ఇందిరాగాంధీ మాటను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్టిచ్చుకోవడంలేదన్నారు.