సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయం: నల్లు | Sardar Patel Services memorable: nallu | Sakshi
Sakshi News home page

సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయం: నల్లు

Jan 12 2014 4:11 AM | Updated on Mar 29 2019 9:18 PM

సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయం: నల్లు - Sakshi

సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయం: నల్లు

సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు.

 ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శనివారం ఆయన పటేల్ విగ్రహ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సంస్థానాల విలీనానికి పటేల్ ఎంతో కృషి చేశారన్నారు. రైతు నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారని ఆయన కొనియాడారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్‌లో నర్మదా నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తై పటేల్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తున్నారని తెలిపారు.
 
 ఈ విషయమై దేశవ్యాప్తంగా ప్రజలను భాగస్వాములను చేయాలని మోడీ నిర్ణయించారని, ఇందుకోసం దేశంలోని ఐదు లక్షల మంది సర్పంచ్‌లకు స్వయంగా ఉత్తరాలు రాస్తున్నారని నల్లు తెలిపారు. దేశంలో అన్ని స్కూళ్లలో వ్యాస రచన పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ పోటీల్లో విజేతలకు మోడీ పంపించిన బహుమతులను అందజేస్తామన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నెల రోజులపాటు ఈ రథంతో పర్యటిస్తామన్నారు.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement