శ్రీగంధం దుంగలు పట్టివేత | Sandalwood logs seized | Sakshi
Sakshi News home page

శ్రీగంధం దుంగలు పట్టివేత

Oct 16 2015 4:03 PM | Updated on Sep 3 2017 11:04 AM

కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న శ్రీగంధం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.

పెద్దతిప్పసముద్రం (చిత్తూరు) : కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న శ్రీగంధం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం గుండ్లపల్లి సమీపంలో శుక్రవారం పోలీసులు వాహన సోదాలు ప్రారంభించారు. అదే సమయంలో ఒక ద్విచక్ర వాహనంలో దాచి ఉంచిన 28 కిలోల శ్రీగంధం దుంగలను గుర్తించారు. వాహనంతోపాటు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ హృషికేశ్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement