తెలంగాణలో వైఎస్ఆర్ సిపి కనుమరుగైందనడం అవాస్తవం అని ఆ పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, జనక్ ప్రసాద్ అన్నారు.
ఇడుపులపాయ: తెలంగాణలో వైఎస్ఆర్ సిపి కనుమరుగైందనడం అవాస్తవం అని ఆ పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, జనక్ ప్రసాద్ అన్నారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ఈ ఉదయం పార్టీ 2వ ప్లీనరీ ప్రారంభం సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో పార్టీకి ఎలాంటి ఫలితాలొస్తాయో, తెలంగాణలో కూడా అలాంటి ఫలితాలే వస్తాయని తెలిపారు.
పార్టీ ప్లీనరీకి తెలంగాణ నుంచి కూడా వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారని చెప్పారు.