అనంతపురంలో బీజేపీ కార్యాలయం ముట్టడి | Samaikyandhra supporters storms BJP office at Anantapuram | Sakshi
Sakshi News home page

అనంతపురంలో బీజేపీ కార్యాలయం ముట్టడి

Aug 17 2013 3:48 PM | Updated on Mar 29 2019 5:57 PM

అనంతపురంలో సమైక్యవాదులు శనివారం బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతు పలకాలంటూ బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు.

అనంతపురం : అనంతపురంలో సమైక్యవాదులు శనివారం బీజేపీ  కార్యాలయాన్ని ముట్టడించారు.  సమైక్యాంధ్రకు మద్దతు పలకాలంటూ బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు.  దీంతో సమైక్యవాదులకు..బీజేపీ నాయకులకు తోపులాట జరిగింది.  పోలీసులు సమైక్యవాదులను  అదుపులోకి తీసుకున్నారు.  సమైక్యాంధ్రకు  మద్దతుగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా రోడ్డెక్కారు.

మరోవైపు శ్రీ కృష్ణదేవరాయ జాయింట్‌ యాక్షన్‌  కమిటీ ఆధ్వర్యంలో  సమైక్యాంధ్ర కోసం విద్యార్థులు, అధ్యాపకులు  రోడ్డెక్కారు. జై సమైక్యాంధ్రప్రదేశ్‌ అనే బ్యానర్లు ప్రదర్శించారు.  విభజన వద్దు ...సమైక్యమే ముద్దు అనే ప్లే కార్డులు ప్రదర్శించారు.  బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  శ్రీకృష్ణ  దేవరాయల యూనివర్శిటీ ప్రధాన గేట్‌ దగ్గర  సోనియా గాంధీ బొమ్మతో  కూడిన వినూత్నమైన ప్లెక్సీని ప్రదర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement