'సమైక్యాంధ్ర, ఏపీఎన్జీవోలు నాకు రెండు కళ్లు' | Samaikyandhra, APNGO are two eyes, says Ashok babu | Sakshi
Sakshi News home page

'సమైక్యాంధ్ర, ఏపీఎన్జీవోలు నాకు రెండు కళ్లు'

Dec 30 2013 6:34 PM | Updated on Sep 2 2017 2:07 AM

'సమైక్యాంధ్ర, ఏపీఎన్జీవోలు నాకు రెండు కళ్లు'

'సమైక్యాంధ్ర, ఏపీఎన్జీవోలు నాకు రెండు కళ్లు'

సమైక్యాంధ్ర, ఏపీఎన్జీవోల సమస్యలు నాకు రెండు కళ్లు లాంటివి'' అని ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యాఖ్యానించారు.

కాకినాడ: ''సమైక్యాంధ్ర, ఏపీఎన్జీవోల సమస్యలు నాకు రెండు కళ్లు లాంటివి'' అని ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. ఈ రెండింటితోనే ఏపీఎన్జీవోల ఎన్నికలకు పోతామని ఆయన అన్నారు. అసెంబ్లీలో బిల్లును అడ్డుకునేందుకు ఒత్తిడి తెచ్చేలా జనవరి 2న విశాఖలో సమైక్యాంధ్ర మహాసభ ఏర్పాటు చేయనున్నట్టు అశోక్‌బాబు ప్రకటించారు.

అంతేకాకుండా జనవరి 3న సీమాంధ్ర బంద్కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చే సీమాంధ్రులకు సమైక్యాంధ్ర విలువలు తెలియజేస్తామని అశోక్బాబు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement