సమైక్య ఐక్యవేదిక సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు | Samaikya ikya vedika organisers arrested by miyapur police | Sakshi
Sakshi News home page

సమైక్య ఐక్యవేదిక సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు

Sep 17 2013 2:34 PM | Updated on Sep 1 2017 10:48 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా కూకట్పల్లిలో సమైక్య ఐక్య వేదిక నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా కూకట్పల్లిలో సమైక్య ఐక్య వేదిక నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమావేశానికి అనుమతి లేదంటూ రౌండ్ టేబుల్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులోభాగంగా సమైక్య ఐక్యవేదిక నిర్వాహకులు జనచైతన్యవేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, హర్షవర్థనరెడ్డి, గౌతం, చల్లా మధుసూధనరెడ్డిలను మియాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.

 

దాంతో ఆ సభకు విచ్చేసిన అధికమంది సమైక్యవాదులు నిరాసనతో వెనక్కిమళ్లాల్సి వచ్చింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు, న్యాయవాదులు మంగళవారం కూకట్పల్లిలో సమైక్య ఐక్య వేదిక ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement