‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’ ఫైనల్స్‌లో ‘తూర్పు’ సుమాల గుబాళింపు | sakshi india spell bee | Sakshi
Sakshi News home page

‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’ ఫైనల్స్‌లో ‘తూర్పు’ సుమాల గుబాళింపు

Dec 7 2014 12:17 AM | Updated on Sep 2 2017 5:44 PM

‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’ ఫైనల్స్‌లో ‘తూర్పు’ సుమాల గుబాళింపు

‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’ ఫైనల్స్‌లో ‘తూర్పు’ సుమాల గుబాళింపు

హైదరాబాద్‌లో రాష్ర్టస్థాయిలో శుక్రవారం జరిగిన ‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’ పోటీల్లో మన జిల్లా విద్యార్థులు విజేతలుగా నిలిచారు.

 ఆల్కాట్‌తోట (రాజమండ్రి) :హైదరాబాద్‌లో రాష్ర్టస్థాయిలో శుక్రవారం జరిగిన ‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’ పోటీల్లో మన జిల్లా విద్యార్థులు విజేతలుగా నిలిచారు. కేటగిరి-1లో శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ విద్యార్థిని జి.యోషిత ద్వితీయ స్థానంలో నిలిచి రూ.15 వేలు, ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ రెండో తరగతి విద్యార్థిని బి.నిత్యాన్విత తృతీయ స్థానం సాధించి రూ.10 వేలు, కేటగిరి-2లో ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నాలుగో తరగతి విద్యార్థి వి.వందిత్ తృతీయ స్థానంతో రూ.10 వేలు, కేటగిరి-3లో అదే స్కూల్ ఐదో తరగతి విద్యార్థిని తితిక్ష శివప్రియ ప్రథమ స్థానంతో రూ.25 వేలు, ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థిని కె.చూడామణి కేటగిరి-4లో ప్రథమ స్థానం సాధించి రూ.25 వేలు ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. ఆ మొత్తాలకు సంబంధించిన చెక్కులను ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, డెరైక్టర్ల చేతులమీదుగా అందుకున్నారు.
 
 విజేతలకు అభినందనలు
 ‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’ పోటీల్లో విజేతలుగా నిలిచిన తమ విద్యార్థులు తితిక్ష శివప్రియ, వి.వందిత్‌లను ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత బాలాత్రిపురసుందరి, డెరైక్టర్లు వంశీకృష్ణ, రూపాదేవి, నారాయణరావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రసాదరెడ్డి, మృణాళిని అభినందించారు. ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో విజేతలుగా నిలిచిన కె.చూడామణి, బి.నిత్యాన్వితలను డెరైక్టర్ వై.రవిబాబు, చైర్‌పర్సన్ వై.విజయకుమారి, ప్రిన్సిపాల్ ఆర్.రవీంద్రనాథ్, ఉపాధ్యాయులు అభినందించారు. శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్లో విజేతగా నిలిచిన జి.యోషితను డెరైక్టర్ సుంకర రవికుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement