సీఎస్ టక్కర్ పదవీకాలం పొడిగింపు | S P Tucker Extension as AP Chief Secretary for three months | Sakshi
Sakshi News home page

సీఎస్ టక్కర్ పదవీకాలం పొడిగింపు

Nov 5 2016 2:40 AM | Updated on Aug 18 2018 6:32 PM

సీఎస్ టక్కర్ పదవీకాలం పొడిగింపు - Sakshi

సీఎస్ టక్కర్ పదవీకాలం పొడిగింపు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ పదవీకాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి. టక్కర్ పదవీకాలాన్ని కేంద్రప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. వాస్తవంగా టక్కర్ ఆగస్టు నెలాఖరునే పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎస్‌గా టక్కర్‌ను మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అనుమతించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తొలుత మూడు నెలల పాటు సీఎస్‌గా టక్కర్ కొనసాగించేందుకు అనుమతించింది.
 
ఆ అనుమతి ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టక్కర్‌కు మరో మూడు నెలలు సీఎస్‌గా కొనసాగించేందుకు అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి గత నెలలో  మరోమారు కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం టక్కర్ పదవీ కాలాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ శుక్రవారం అమోదం తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement