జగన్ పాలనలో మరింత ‘సంక్షేమం’ | Rule on the more 'welfare' | Sakshi
Sakshi News home page

జగన్ పాలనలో మరింత ‘సంక్షేమం’

Apr 11 2014 3:22 AM | Updated on Jul 7 2018 2:56 PM

పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణపాలన చూశారని, తండ్రి ఆశయాల కోసం...

  •     తండ్రి ఆశయాలకోసం పాటుపడుతున్న జననేత
  •      తిరుపతిలో వైఎస్ సోదరుడు రవీంద్రారెడ్డి ప్రచారం
  •  తిరుపతి, న్యూస్‌లైన్: పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణపాలన చూశారని, తండ్రి ఆశయాల కోసం నిరంతరం పాటుపడుతూ మరిన్ని సంక్షేమ పథకాలను అందించనున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలననూ ఒకసారి చూడండంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ రవీంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.

    తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఎంవీ ఎస్.మణి, మోహన్,  శేఖర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రారెడ్డి మాట్లాడుతూ తమ అన్న రాజశేఖరరెడ్డి నిరంతరం పేదల సంక్షేమం కోసమే పాటుపడేవారని గుర్తుచేశారు. డాక్టర్‌గా ఒక రూపాయి ఫజుతోనే పేదలకు వైద్యం అందించారన్నారు. పేదలకు నిరంతరం ఎనలేని సేవలందించాలన్న సంకల్పంతో అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి ఏ నాయకుడూ చేయలేనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు.

    పేదల సమస్యలను తెలుసుకుని మరిన్ని సంక్షేమ పథకాలను అందించాలన్న లక్ష్యంతో జోరు వానను సైతం లెక్కచేయకుండా హెలికాప్టర్‌లో బయలుదేరి తిరిగిరాని లోకాలకు వె ళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేసిన వారిని ఎప్పుడూ ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తారన్నారు. వైఎస్ మరణానంతరం టీడీపీ, కాంగ్రె స్ కుమ్మక్కు రాజకీయాలతో రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఎంతగా హింసపెట్టాయో ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు.

    తండ్రి ఆశయం కోసం కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి అభ్యున్నతి కోసం శ్రమిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే సీమాంధ్ర అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. తిరుపతిలో ఇల్లిల్లూ తిరిగి ప్రజల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఒక కరుణాకరరెడ్డి మాత్రమేనన్నారు.  తిరుపతిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దగల సత్తా కరుణాకరరెడ్డికి మాత్ర మే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చాంద్‌బాషా, శివ, మహిళలు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement