12వ రోజుకూడా ఆంధ్రపదేశ్ నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులని ఆర్టీసీ నిలిపేసింది
చిత్తూరు: చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ నేపథ్యంలో తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నయి. దీంతో 12వ రోజుకూడా ఆంధ్రపదేశ్ నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులని ఆర్టీసీ నిలిపేసింది. సర్వీసులని నిలపడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నామని, ఇలానే కొనసాగితే సోమవారం నుంచి తమిళనాడు బస్సులని ఏపీలో తిరగనివ్వమంటూ స్థానికులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా, శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.