వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
- ఆరుగురికి తీవ్ర గాయాలు
గోపవరం(వైఎస్సార్‌జిల్లా)
వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం తీపిగుంట వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు తీపిగుంట వద్దకు రాగానే ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.