ప్రైవేట్ ట్రావెల్స్పై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు | RTA Officers Seized Private Travel Buses in AndhraPradesh state | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ట్రావెల్స్పై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు

Jan 14 2015 8:26 AM | Updated on Sep 2 2017 7:43 PM

రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారుల దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి.

విజయవాడ: రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారుల దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లాలో 6, పశ్చిమగోదావరి జిల్లాలో 6, ప్రకాశంలో 2, కడపలో ఒక బస్సును ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకుని జప్తు చేశారు. అలాగే మరో 9 బస్సులను కూడా స్వాధీనం చేసుకుని రవాణశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement