హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా నిబంధనలు పాటించలేని 68 బస్సులపై కేసులు నమోదు చేశారు.
ఏపీ వ్యాప్తంగా ఆర్టీఏ తనిఖీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వ్రైవేట్ బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు విరుద్ధంగా తిరుగుతున్న 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసినట్లు సమాచారం. అదే సమయంలో పలు బస్సులపై కేసులు నమోదు చేశారు ఆర్టీఏ అధికారులు. సుమారు 289 బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులపై రూ. ఏడు లక్షలుగా పైగా జరిమానా విధించారు.
ఇదీ చదవండి:


