ఎర్రచందనం అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించడానికి అటవీ అధికారులు ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉన్నారు.
చిత్తూరు: ఎర్రచందనం అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించడానికి అటవీ అధికారులు ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉన్నారు. స్మగ్లింగ్ కార్యాకలపాలను అడ్డుకున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు అటవీ ప్రాంతాల్లో నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని బాకరా పేట అటవీప్రాంతంలో రూ. 12 లక్షల విలువ చేసే ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు ఎర్రచందనాన్ని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.