పూజారిని చితకబాది ఆలయంలో నగదు చోరీ | Robbery in Sri Venkateswara Temple near Gutturu village in Anantapur District | Sakshi
Sakshi News home page

పూజారిని చితకబాది ఆలయంలో నగదు చోరీ

Sep 21 2014 10:39 AM | Updated on Nov 9 2018 6:29 PM

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.

అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు ఆలయంలో చోరీకి యత్నించగా... అక్కడే ఉన్న పూజారి వారిని వారించారు. దీంతో ఆగ్రహించిన దొంగలు పూజారిపై ఆయుధాలతో దాడి చేశారు. ఆ దాడిలో పూజారి రక్తపు మడుగులో స్పృహా తప్పి పడిపోయారు. 

ఆలయంలోని మూడు హుండీలలోని నగదును దొంగలు అపహారించుకుని పోయారు. స్థానికులు వెంటనే స్పందించి పూజారిని ఆసుపత్రికి తరలించారు. పూజారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో చోరీ జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. హుండీలో దాదాపు రూ. 2 లక్షల నగదును దొంగలు అపహరించుకుని పోయారని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement