తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దుండగులు చోరీకి పాల్పడ్డారు.
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. నగరంలోని హుకంపేటలోని ఓ రైల్వే ఉద్యోగి ఇంట్లో సోమవారం రాత్రి జొరబడిన దుండగులు 100 గ్రామాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అలాగే అరకిలో వెండి వస్తువులును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల కోసం గాలింపు చేపట్టామని పోలీసు అధికారులు తెలిపారు.