కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

డోన్‌:
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ వస్తున్న క్రమంలో గ్యాస్‌ లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. డోన్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో సోమవారం తెల్లవారుజామున గ్యాస్‌లోడుతో వెళ్తున్న లారీని ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. లారీలో ఉన్న సిలిండర్లన్ని చెల్లాచెదురుగా కింద పడటంతో అవి పేలే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

Back to Top