రాష్ర్టం కరువు కోరల్లో ఉంటే సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేయడమేం టని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ
(ఇచ్ఛాపురం రూరల్): రాష్ర్టం కరువు కోరల్లో ఉంటే సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేయడమేం టని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ప్రశ్నించారు. ఆమె గురువారం లొద్దపుట్టిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయక చర్యలపై ప్రధానమంత్రిని కలుస్తూ ఆర్థిక సాయా న్ని అభ్యర్థిస్తుంటే మన ముఖ్యమంత్రి మా త్రం విహార యాత్రలు చేస్తూ రాష్ట్ర ప్రజలను ఇంకా కష్టాల సుడిగుండంలో నె డుతున్నారని విమర్శించారు.
జిల్లాలోని 28 లక్షల మంది జనాభాలో ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది వరకు వలస కూలీలుగా ఇతర ప్రాంతాల్లో ఇతరత్రా పనులు చేసుకుంటుంటే కనీసం అధికారులైనా, ప్రజా ప్రతినిధులైనా స్పందించకపోవడం విచారకరమనీ, వలసలు నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. మత్స్యకారులకు వేట నిషేధం కాలంలో సాయం అందించాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త నర్తు రామారావు, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యవర్శి సల్ల దేవరాజు, మాజీ ఎంపీపీలు పీఎం తిలక్, మంగి గణపతి, ట్రేడ్ యూనియన్ కార్యదర్శి చత్రపతి, నాయకులు చిట్టిబాబు, ప్రకాష్ పట్నాయిక్, రామారావు తదితరులు పాల్గొన్నారు.