రియల్ ఎస్టేట్ వ్యాపారి దుర్మరణం | Real estate businessman killed | Sakshi
Sakshi News home page

రియల్ ఎస్టేట్ వ్యాపారి దుర్మరణం

Jan 1 2016 3:03 AM | Updated on Sep 3 2017 2:53 PM

కారు చెట్టుకు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందాడు.

పాలకొల్లు అర్బన్ : కారు చెట్టుకు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రగాయాలపాలై పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాలకొల్లు రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. మొగల్తూరు మండలం కేపీ పాలెం (సౌత్) ముచ్చర్లవారిమెరకు చెందిన ముచ్చర్ల అలెగ్జాండర్ (47), అతని పెద్దన్నయ్య కుమారుడు ముచ్చర్ల ఫణీంద్రనాథ్ భూపతి ఇరువురు కలిసి టాటా ఇండికా కారులో బుధవారం ఉదయం విశాఖపట్టణం బయలుదేరారు.
 
  అక్కడ పనులు ముగించుకుని తిరిగి ప్రయాణమయ్యారు. గురువారం తెల్లవారుజామున పాలకొల్లు - నరసాపురం రోడ్డులోని దిగమర్రు సెంటర్‌కి సమీపంలో నిద్రగన్నేరు చెట్టును ఢీకొట్టడంతో అలెగ్జాండర్ తలపగిలి, కాళ్లు విరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవింగ్ చేస్తున్న ఫణీంద్రనాథ్ భూపతి ఎడమకాలు విరిగిపోవడంతో భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు అలెగ్జాండర్‌కు భార్య సుజాత, కుమార్తెలు మయూరి, తేజస్వి ఉన్నారు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. రూరల్ సీఐ ఆరిమిల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్సై కెఎం వంశీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలెగ్జాండర్ వ్యాపార రీత్యా నరసాపురంలో స్థిరపడ్డాడు. పేరుపాలెం బీచ్‌లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అతనే నిర్మించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement