లోకల్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం | Rashi khanna Open New Restaurant in Visakhapatnam | Sakshi
Sakshi News home page

లోకల్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం

Nov 3 2018 7:00 AM | Updated on Nov 5 2018 1:30 PM

Rashi khanna Open New Restaurant in Visakhapatnam - Sakshi

రెస్టారెంట్‌ ప్రారంభిస్తున్న సినీ నటి రాశీఖన్నా

అందం, అభినయం కలిపి రాశిగా పోసి కనువిందు చేసిన అనుభూతిని అభిమానులు సొంతం చేసుకున్నారు. ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకుశుక్రవారం నగరానికి విచ్చేసిన సినీనటి రాశీఖన్నా తన హావభావాలతో అభిమానులను అలరించింది.

బీచ్‌రోడ్డు(విశాఖతూర్పు): షూటింగ్‌ నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అక్కడ లోకల్‌ ఫుడ్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తానని సినీ నటి రాశీఖన్నా అన్నారు. సిరిపురంలోని వాల్తేర్‌ క్లబ్‌ ఎదురుగా సామ్స్‌ గ్రిల్డ్‌ మల్టీ క్యుజిన్‌ రెస్టారెంట్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె అక్కడ ఫుడ్‌ను రుచి చూశారు. ఈ సందర్భంగా రాశీ ఖన్నా మాట్లాడుతూ వెజ్‌..నాన్‌వెజ్‌ అనే తేడా లేకుండా అన్ని రకాల రుచులను ఇష్టపడతానని పేర్కొన్నారు. అందరికీ అనువుగా..విశాఖ ప్రజల మన్ననలు అందుకునేలా రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారని, ఇక్కడ ఫుడ్‌ కూడా చాలా బాగుందన్నారు.

అమెరికన్, చైనీస్, మెక్సికన్, ఇటాలియన్‌ ఫుడ్‌ చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ రెస్టారెంట్‌ హైదరాబాద్, బెంగళూరులో ఇప్పటికే కస్టమర్ల మన్ననలు పొందాయని, తాజాగా వైజాగ్‌లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం వైజాగ్‌లో తమిళ సినిమా షూటింగ్‌ జరుగుతోందని, అందులో తాను నటిస్తున్నట్టు చెప్పారు. విశాఖ ప్రజలు తన చిత్రాలను ఆదరిస్తూ..ప్రోత్సహిస్తున్నారన్నారు. రెస్టారెంట్‌ నిర్వాహకులు సత్య శ్రీరామ్‌ మాట్లాడుతూ శాకాహార, మాంసాహార ప్రియులకు పూర్తి స్థాయిలో విందును అందించే దిశగా తమ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దడం జరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement