రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లాలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు అర్బన్‌జిల్లా ఎస్పీ రవికుమార్‌మూర్తి ఆధ్వర్యంలో
నగరంపై నిఘా నేత్రం
Jan 30 2014 2:12 AM | Updated on Aug 14 2018 3:37 PM
ఆల్కాట్‌తోట(రాజమండ్రి), న్యూస్‌లైన్ :రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లాలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు అర్బన్‌జిల్లా ఎస్పీ రవికుమార్‌మూర్తి ఆధ్వర్యంలో ట్రాఫిక్ డీఎస్పీ అనిల్‌కుమార్ నడుం బిగించారు. దీనిలో భాగంగా నగరంలోని ట్రాఫిక్ జంక్షన్‌లలో సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 21 ట్రాఫిక్ జంక్షన్‌లకు గాను 15చోట్ల సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమేరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించేందుకు పోలీసు అతిథిగృహం వద్ద ఒక ప్రత్యేక మాస్టర్ కంట్రోలు రూమ్‌ను ఏర్పాటు చేశారు. కంట్రోలు రూమ్‌లో సిబ్బంది ఎప్పటికప్పుడు సీసీ కెమేరాలోని దృశ్యాలను పరిశీలిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగినా, చోరీలు జరిగినా, సిగ్నల్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయినా, లేక ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా ఈ సీసీ కెమేరాల ఆధారంగా కనుగొని పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు. మలిదశలో ఈ-చలానా విధానాన్ని కూడా ప్రవేశపెడ తారు. ఈ పద్ధతిలో నిబంధనలు ఉల్లం ఘించిన వాహనదారుని ఇంటికే నేరుగా జరిమానా చలానా పంపించే అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ిసీసీ కెమేరా ఏర్పాటును రెండురోజులలో పూర్తి చేసి, పరిశీలించిన తరువాత ప్రారంభిస్తా మని ట్రాఫిక్ డిఎస్పీ అనిల్‌కుమార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
Advertisement
Advertisement