రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి.
	విజయవాడ: రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. కాగా తాజాగా కృష్ణా జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. విజయవాడ, గొల్లపూడి, గన్నవరం, గుడ్లవల్లేరు, హనుమాన్ జంక్షన్, నందివాడ, గుడివాడల్లో వర్షం కురిసింది. పలు రోడ్లు జలమయం అయ్యాయి.
	
	అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేసవి ప్రారంభంలోనే విపరీత ఎండలతో సతమతమవుతున్న జిల్లా వాసులకు కొంత చల్లదనం పలకరించనట్లు ఉపశమనం పొందారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
