భూ సేకరణలో ప్రభుత్వం బరితెగించిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు.
విశాఖ : భూ సేకరణలో ప్రభుత్వం బరితెగించిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో హుద్ హుద్ బాధితులను చంద్రబాబు విస్మరించారన్నారు. కేవలం గ్రేటర్ ఎన్నికలు ఉన్నందునే విశాఖ వాసులకు చంద్రబాబు ప్రభుత్వం తుఫాను సాయం అందించిందని రఘువీర విమర్శించారు.
జలయజ్ఞంలో నిబంధనలకు అనుగుణంగా కాంగ్రెస్ నడుచుకుందని రఘువీరా తెలిపారు. అయితే టీడీపీ ప్రభుత్వం నిబంధనలను పక్కనపెట్టి రూ.కోట్లు కుమ్మరిస్తోందని ఆయన అన్నారు. సిమెంట్, ఇసుక మాఫియాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రఘువీరా వ్యాఖ్యానించారు.