సైకో దాడి: కార్మికుడి మృతి | psycho attack : worker dies in kurnool district | Sakshi
Sakshi News home page

సైకో దాడి: కార్మికుడి మృతి

Jun 8 2017 12:23 PM | Updated on Sep 5 2017 1:07 PM

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం వెలుగుచూసింది.

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం వెలుగుచూసింది. స్థానిక ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన నంది పైపుల ఫ్యాక్టరీలోకి ప్రవేశించిన ఓ సైకో అక్కడ నిద్రిస్తున్న ఓ కార్మికుడిపై దాడి చేసి హతమార్చాడు. ఇది గుర్తించిన తోటి కార్మికులు సైకోను బంధించి పోలీసులకు సమాచారం అందించారు.  ఫ్యాక్టరీలో రోజువారి కూలీగా పని చేస్తున్న రాజేశ్వర్‌(50) అనే కార్మికుడిపై సైకో అశోక్‌ బండరాయితో దాడి చేశాడు. దీంతో తలకు తీవ్ర గాయాలైన రాజేశ్వర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ హరినాథ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని సైకోను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement