కేశినేని నాని కార్యాలయం వద్ద ఆందోళన | Protest outside tdp mp kesineni nani office in vijayawada | Sakshi
Sakshi News home page

కేశినేని నాని కార్యాలయం వద్ద ఆందోళన

Oct 20 2014 10:33 AM | Updated on Aug 10 2018 7:07 PM

టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద సోమవారం స్థానికులు ఆందోళనకు దిగారు.

విజయవాడ :  విజయవాడ పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద సోమవారం స్థానికులు ఆందోళనకు దిగారు.  లీజుకు ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఎంపీ కేశీనేనిపై ఆరోపణలు ఉన్నాయి.  బొమ్మదేవర వెంకట సుబ్బారావుకు చెందిన 500 గజాల స్థలాన్ని ఏడాదిగా కేశనేని నాని పార్కింగ్కు ఉపయోగించుకుంటున్నారు.

 

అయితే రెండు నెలలుగా ఆ స్థలాన్ని ఖాళీ చేసి ..తమకు అప్పగించాలని కోరినా పట్టించుకోవటం లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. దాంతో బాధితుడు స్థానికులతో కలిసి ఈరోజు ఉదయం నాని కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశాడు. తక్షణమే తన స్థలాన్ని అప్పగించాలని డిమాండ్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement