అనిత పాదయాత్రకు నిరసనల సెగ | Protest Againist Payaka Rao pet TDP MLA Anitha In Visakapatnam | Sakshi
Sakshi News home page

అనిత పాదయాత్రకు నిరసనల సెగ

Jan 3 2019 7:07 PM | Updated on Jan 3 2019 7:17 PM

Protest Againist Payaka Rao pet TDP MLA Anitha In Visakapatnam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

విశాఖపట్నం: పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత చేపట్టిన పాదయాత్రకు నిరసనల సెగ తగిలింది. మంచినీటి సరఫరా కల్పించలేదని, పారిశుద్ధ్యం లోపించిందని, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని నిరసన వ్యక్తం చేస్తూ ఎస్‌ రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామస్తులు ఎమ్మెల్యే అనితను అడ్డుకున్నారు. ఫ్లకార్డులు, ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తుల చర్యతో ఏం చేయాలో పాలుపోక  ఇచ్చిన హామీలు త్వరలోనే నెరవేరుస్తానని చెప్పి ఎమ్మెల్యే అనిత అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.

గిడ్డి ఈశ్వరిని అడ్డుకున్న గిరిజనులు

విశాఖపట్నం: ఏజెన్సీలో టీడీపీ చేపట్టిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరినీ స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. జి. మాడుగుల మండలం లోచలిలో రోడ్డు ఎందుకు మంజూరు చేయలదేని స్థానికులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గిరిజనులు వాగ్వాదానికి దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement