ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తప్పుబట్టింది.
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తప్పుబట్టింది. ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమాలకు, ముఖ్యమంత్రి నిర్వహించే విలేకరుల సమావేశాలకు సాక్షి మీడియా, నమస్తే తెలంగాణలకు చెందిన ప్రతినిధులను అనుమతించని విషయం తెలిసిందే. ఈ విషయమై పాత్రికేయుల సంఘం ఐజేయూ చేసిన ఫిర్యాదుకు ప్రెస్ కౌన్సిల్ స్పందించింది.
ఇలా మీడియాను అనుమతించకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని ప్రెస్ కౌన్సిల్ చెప్పింది. ఇది రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. ఈ విషయమై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో రాజీవ్ రంజన్ నాగ్, కె.అమర్నాథ్, ప్రజ్ఞానంద చౌదరి ఉన్నారు.