ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనాథ్‌కు కేబినెట్‌ హోదా

Press Academy Chairman Devireddy Sreenath Gets Cabinet Rank - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా నియమితులైనదేవిరెడ్డి శ్రీనాథ్‌కు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. సీనియర్‌ పాత్రికేయుడైన దేవిరెడ్డి శ్రీనాథ్‌ను ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది నవంబరు 8న ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆయనకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదివారం జీఓ జారీ చేశారు. 

కాగా.. నవంబర్‌ 21న ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జర్నలిజం వృత్తిలో అపార అనుభవం ఉన్న శ్రీనాథ్ వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామ వాస్తవ్యులు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగారు.  చదవండి ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి

కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. శ్రీనాథ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహిత జర్నలిస్టు కూడా.  ( దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top