నూతన కార్యవర్గం ఏర్పాటు | praviate degree college management associate conference at harita restaurent | Sakshi
Sakshi News home page

నూతన కార్యవర్గం ఏర్పాటు

Apr 11 2014 4:09 AM | Updated on Sep 2 2018 3:39 PM

వైవీయూ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ సమావేశం కడపలోని హరిత రెస్టారెంట్‌లో గురువారం జరిగింది.

కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వైవీయూ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ సమావేశం కడపలోని హరిత రెస్టారెంట్‌లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా డీవీఎస్ చక్రవర్తిరెడ్డి(ఎస్‌డీహెచ్‌ఆర్ డిగ్రీ, పీజీ కళాశాలల కరస్పాండెంట్)ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో వైవీయూ పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు.

అసోసియేషన్ కార్యదర్శిగా అక్బర్‌ఖాన్(అల్‌హబీబా విద్యాసంస్థలు), ఉపాధ్యక్షుడిగా పెంచలయ్య(కోడూరు సాయి కళాశాల), కోశాధికారిగా సుబ్బారెడ్డి(కడప శ్రీహరి డిగ్రీ కళాశాల), హరినారాయణ(ప్రొద్దుటూరు ఎస్‌వి డిగ్రీ కళాశాల), ఆర్.రామచంద్రారెడ్డి(లేపాక్షి డిగ్రీ కళాశాల)ను ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా రాజశేఖరరెడ్డి(ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ మాజీ సెక్రటరీ)ని ఎంపిక చేశారు.


రాజగోపాల్‌రెడ్డి(కమలాపురం డిగ్రీ కళాశాల), సుండుపల్లె వీరభద్ర డిగ్రీ కళాశాల, లక్కిరెడ్డిపల్లె శ్రీ వినాయక డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్ డి.రామసునీల్‌రెడ్డి, రాయచోటి అర్చన డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ మదన్‌మోహన్‌రెడ్డి, రాయచోటి శ్రీనివాస డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాసులురెడ్డి, నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, వైష్ణవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సూర్యనారాయణరెడ్డి, జిల్లాలోని పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు నాగార్జునరెడ్డి, నాగేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, తనుష్, ప్రవీణ్ పాల్గొన్నారు.

 ప్రైవేట్ కళాశాలల సమస్యల పరిష్కారానికి కృషి
 జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆ కళాశాలల కరస్పాండెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు డీవీఎస్ చక్రవర్తిరెడ్డి, కార్యదర్శి లయన్ పఠాన్ అక్బర్‌ఖాన్ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement