తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్లే తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు.
కాకినాడు: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్లే తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఎన్జీ రంగా యూనివర్సిటీ పేరు మార్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
వచ్చే బడ్జెట్‌లో వ్యవసాయానికి మూడు లేదా నాలుగు వేల కోట్ల రూపాయిలతో ప్రత్యేక బడ్జెట్ రూపొందించనున్నట్టు పుల్లారావు చెప్పారు. కాకినాడలో నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కాగా చేపల వేట నిషేధిత సమయంలో మత్స్యకారులకు ఐదు వేల రూపాయిల నష్టపరిహారం ఇస్తామని టీడీపీ హామీ ఇవ్వలేదని మంత్రి చెప్పారు.