చంద్రబాబు అసలు రంగు బయటపడింది: దత్తాత్రేయ | PPA cancel is undemocratic: Dattatreya | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అసలు రంగు బయటపడింది: దత్తాత్రేయ

Jun 22 2014 1:39 PM | Updated on Sep 2 2017 9:13 AM

చంద్రబాబు అసలు రంగు బయటపడింది: దత్తాత్రేయ

చంద్రబాబు అసలు రంగు బయటపడింది: దత్తాత్రేయ

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయడం అప్రజాస్వామికమని సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ అన్నారు.

హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయడం అప్రజాస్వామికమని సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ అన్నారు.  రెండు ప్రాంతాలు రెండుకళ్లన్న అనే చంద్రబాబునాయుడు అసలు రంగు బయటపడిందని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసి.. ఆంధ్ర ప్రదేశ్ కే న్యాయం చేస్తారనుకోలేదని దత్తాత్రేయ విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేవ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని దత్తాత్రేయ అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పీపీఏ వివాదానికి కేంద్ర ప్రభుత్వం సానుకూల పరిష్కారం అందిస్తుందనే ఆశాభావాన్ని దత్తాత్రేయ వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement