రాష్ట్రాల హక్కును హరించేలా ఉన్నాయి: ఎంపీ కవిత | Powers to Governor is spoils the state rights and interests, MP K.Kavita | Sakshi
Sakshi News home page

రాష్ట్రాల హక్కును హరించేలా ఉన్నాయి: ఎంపీ కవిత

Jul 7 2014 10:42 PM | Updated on Sep 2 2017 9:57 AM

రాష్ట్రాల హక్కును హరించేలా ఉన్నాయి: ఎంపీ కవిత

రాష్ట్రాల హక్కును హరించేలా ఉన్నాయి: ఎంపీ కవిత

గవర్నర్‌కు శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలిచ్చే కేంద్రం ప్రతిపాదనలను నిజమాబాద్ ఎంపీ కవిత తప్పుపట్టారు

న్యూఢిల్లీ: గవర్నర్‌కు శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలిచ్చే కేంద్రం ప్రతిపాదనలను నిజమాబాద్ ఎంపీ కవిత తప్పుపట్టారు. శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలు గవర్నర్ కు ఇవ్వడమంటే రాష్ట్రాల హక్కును హరించడమే అని ఎంపీ కవిత అన్నారు. కేంద్ర ప్రతిపాదనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని కవిత వ్యాఖ్యానించారు. 
 
హైదరాబాద్‌లో అందరం శాంతియుతంగా సామరస్యంగా ఉంటున్నానమని ఎంపీ కవిత తెలిపారు. రాష్ట్ర విభజన కోసం జరిగిన ఉద్యమ సందర్భంగానూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినా తర్వాత కూడా ఇరుప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు చెలరేగాయని ఎక్కడా ఏ చిన్న ఘటన నమోదు కాలేదని ఆమె తెలిపారు.
 
కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కలిసి కేంద్రం జోక్యంపై నిరసన తెలిపామన్నారు. కేంద్ర ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నామని ఎంపీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement