టీడీపీలో పదవుల చిచ్చు | positons of TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో పదవుల చిచ్చు

Feb 5 2015 2:19 AM | Updated on Jun 1 2018 8:52 PM

టీడీపీలో పదవుల చిచ్చు - Sakshi

టీడీపీలో పదవుల చిచ్చు

తెలుగుదేశం పార్టీలో పదవుల చిచ్చు రగులుతోంది.

సాక్షిప్రతినిధి, అనంతపురం : తెలుగుదేశం పార్టీలో పదవుల చిచ్చు రగులుతోంది. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడిన నేతలను విస్మరించి, ఇతర పార్టీల నుంచి వలసొచ్చిన వారికి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని అందలం ఎక్కించడంపై సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పార్టీ శ్రేయస్సు కంటే వర్గ ప్రయోజనాలే ముఖ్యమనేలా వ్యవహరిస్తూ తన అనునాయులకు మాత్రమే పదవులు దక్కేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
 
  శాప్ డెరైక్టర్‌గా ఇటీవల షకిల్ షఫీని నియమించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అండతోనే షకిల్ షఫీకి శాప్ డెరైక్టర్ పదవి దక్కిందనేది బహిరంగ రహస్యం. అయితే గత పదేళ్లలో టీడీపీ ఉన్నతి కోసం ఏరోజూ షకిల్‌షఫీ పనిచేయలేదని, టీడీపీ
 వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. 2004లో కేఎం సైఫుల్లా తనయుడు రహంతుల్లాకు అనంతపురం టీడీపీ టిక్కెట్టును పార్టీ కేటాయించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, తమ్ముడు అయిన రహంతుల్లాను కాదని, ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన ప్రభాకర్‌చౌదరికి మద్దతుగా షకిల్‌షఫీ పని చేశారు.  
 
 2009, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ వ్యతిరేకంగా పని చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పదేళ్లలో పార్టీకి వ్యతిరేకంగా కొందరు పని చేసినా పార్టీ శ్రేయస్సు కోసం కష్టపడి పనిచేసిన సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులపై సీనియర్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే పార్టీకోసం పాటు పడిన తమకు కాకుండా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన షకిల్‌షఫీకి పదవి ఇవ్వడంపై భగ్గమంటున్నారు. ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ ‘ఇప్పటి వరకూ షకిల్‌షఫీకి టీడీపీలో సభ్యత్వం కూడా లేదని, ఇలాంటి వారికి పద వులు ఎలా కట్టబెడతార’ని ప్రశ్నిస్తున్నారు.
 
 టౌన్ బ్యాంకు అధ్యక్ష పీఠంపై
 మురళిని కూర్చోబెట్టే యత్నం
 టౌన్‌బ్యాంక్ అధ్యక్షునిగా కొనసాగుతున్న గౌతమ్‌ను ఇటీవల ప్రభుత్వం బర్త్ఫ్ ్రచేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాబట్టే ఇతన్ని బర్త్ఫ్ ్రచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ కార్పొరేటర్ మురళీని టౌన్‌బ్యాంక్ అధ్యక్షునిగా నియమించేందుకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి యత్నిస్తున్నారు. దీనికోసం రాజధానిలో పంచాయతీ పెట్టారు. మురళీతో పాటు ఎమ్మెల్యే కూడా రాజధానికి చేరుకున్నారు. మురళీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇన్నాళ్లూ టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారు. మొన్నటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వలస వచ్చారు. ఈ క్రమంలో మురళీకి టౌన్‌బ్యాంక్ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ఎమ్మెల్యే ఆలోచించడంపై కూడా సీనియర్లు పెదవి విరుస్తున్నారు. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గంపన్న టీడీపీ కార్యకర్తలా కాకుండా ప్రభాకర్ చౌదరి అనుచరుడిగానే ఉంటూ టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారని, ఇలాంటి వ్యక్తికి డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టారని, అది సరే! అనుకుంటే షకిల్‌షఫీ..ఆ తర్వాత మురళీ...ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యే చెప్పినవారికి, ఆయన వర్గీయులే పదవులు దక్కడంపై సీనియర్లు ఆక్షేపిస్తున్నారు.
 
 కాగా 2004, 2009లో కూడా టీడీపీకి వ్యతిరేకంగా పని చేసిన ప్రభాకర్ చౌ దరిని ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేనే చేశారని, నామినేటెడ్ పోస్టులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి దక్కడంలో ఆశ్చర్యం ఏముందని ఓ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ‘సాక్షి’తో అన్నారు. అయితే ఎమ్మెల్యే వైఖరి ఎలా ఉన్నా, జిల్లాలో ఇద్దరు మంత్రులు, సీనియర్ నేతలు ఇలాంటి కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయకుండా ఎమ్మెల్యేకు వత్తాసు పలకడం దారుణమంటున్నారు. అధికారం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని, మరో దారి చూసుకుంటామని కొందరు నేతలు ‘సాక్షి’తో అన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement