జిల్‌ జిల్‌ జిల్‌ జిగేల్‌ రాణి

Pooja hegde grand opening at guntur swathi shopping mall - Sakshi

సందడి చేసిన సినీ నటులు  

సొట్ట బుగ్గల సుందరి పూజా హెగ్డే శనివారం గుంటూరులో సందడి చేసింది. కొంటె చూపులతో కుర్రకారును ఉర్రూతలూగిస్తూ హలో హాయ్‌ అంటూ చిలక పలుకులు పలికింది. లక్ష్మీపురంలో స్వాతి షాపింగ్‌ మాల్‌ ప్రారంభానికి వచ్చిన ఈ సొగసరి.. చిరుదరహాసంతో యువతను  ఆకట్టుకుంది.     

గుంటూరు ఈస్ట్‌: లక్ష్మీపురం మెయిన్‌ రోడ్డులో స్వాతి షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి శనివారం వివిచ్చేసిన సినీతారలు సందడి చేశారు. హీరోయిన్‌ పూజా హెగ్డే జ్యోతి ప్రజ్వలన గావించి మాట్లాడారు. అత్యాధునిక ఫ్యాషన్‌ దుస్తులు గుంటూరు నగర ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమని చెప్పారు. అందులోనూ డిస్కౌంట్‌ ధరలకే అందిస్తున్నారని తెలిపారు. ఆమెతోపాటు బిగ్‌ బాస్‌ ఫేమ్‌లు కౌశల్, దీప్తి అభిమానులకు అలరించారు. అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు రిబ్బన్‌ కట్‌ చేసి షోరూమ్‌ ప్రారంభించారు. షాపింగ్‌ మాల్‌ అధినేత వీవీ రమణబాబు లక్కీ డ్రాలో విజేతను ఎంపిక చేశారు. విజేతకు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.  తమ అభిమాన తారలను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top